15-10-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం...

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ పాడ్యమి రా.11.28 చిత్త సా.6.20 రా.వ.12.13 ల 1.52. సా.దు. 4.12 ల 5.00.
 
ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. సమర్ధతకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తే అవకాశం ఉంది.
 
వృషభం :- మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు మంచిదికాదు అని గమనించండి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు లాభిస్తాయి.
 
మిథునం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధువులను విందుకు ఆహ్వానిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు.
 
సింహం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్త్రీలు పనివారితో సమస్యలను ఎదుర్కొంటారు. చేతిలో ధనం నిలబడదు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో గృహ వాతావరణం సంతృప్తినిస్తుంది.
 
కన్య :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీపై సెంటిమెంట్లు, బంధురీవుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ అధికమవుతుంది.
 
తుల :- స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది వ్యాపార రీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. వీలైనంతవరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.
 
వృశ్చికం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువులకు పెట్టిపోతల విషయంలో పెద్దల సలహా పాటించటం ఉత్తమం.
 
ధనస్సు :- వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ శ్రీమతి వైఖరి సంతోషపరుస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులు తొలగిపోతాయి.
 
మకరం :- కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. వేడుకల్లో పాల్గొంటారు.
 
కుంభం :- బంధువుల అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రియతముల గురించి ఆరాటం చెందుతారు. మీ మేలు పొందిన వారే మీపై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు.
 
మీనం :- మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. కార్యసాధనకు ఓర్పుతో శ్రమించాలి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తంచేయండి. ఆత్మీయులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments