Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-10-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం...

Advertiesment
kanya rashi
, మంగళవారం, 10 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| ఏకాదశి ప.3.08 ఆశ్రేష ఉ.7.02 రా.వ.8.20 ల 10.06. ఉ. దు. 8.16 ల 9.04 రా.దు. 10.37 ల 11.26.
 
ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఇతరత్రా సమస్యలు అధికం. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. 
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త పథకాలు రూపొందిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పిగొట్టగలుగుతారు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
కర్కాటకం :- మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలలో చికాకులు తప్పవు. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. క్రయ విక్రయాలు ఊపందు కుంటాయి. పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది.
 
సింహం :- స్త్రీలకు షాపింగుల్లో నాణ్యతను గయనించాలి. విద్యార్థులు వాహనం నడుపునప్పుడు ఏకాగ్రత మెళకువ అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. కొన్ని విషయాలను చూసీ చూడనట్టుగా వదిలేయాలి. వృత్తి వ్యాపార రంగాల్లో సహచరుల మద్దతు లభిస్తుంది.
 
కన్య :- వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తాయి. పెద్దలతో ఏకీభవించలేరు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి ఉంటుంది. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
తుల :- ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
వృశ్చికం :- పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రులతో ఏకీభవించలేకపోతారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు.
 
ధనస్సు :- మీ లక్ష్య సిద్ధికి నింతర కృషి పట్టుదల అవసరమని గమనించండి. ఆధ్యాత్మిక చింతన, వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్లీడర్లకు, పీడరు గుమాస్తాలకు అనుకూలమైన కాలం.
 
మకరం :- ముఖ్యమైన వ్యవహారాల్లో అయిన వారి సలహా తీసుకోవటం మంచిది. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలను ఎదుర్కొంటారు. కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక కుటుంబ విషయాలపట్ల దృష్టి సాగిస్తారు. మీ కళత్ర మొండివైఖరి వల్ల మనశ్శాంతిని కోల్పొతారు. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయునపుడు పునరాలోచన చాలా అవసరం.
 
మీనం :- ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. గృహంలో వస్తువు పోవడానికి అవకాసం ఉంది జాగ్రత్త వహించండి. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-10-2023 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని పూజించిన శుభం...