Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-04-2024 సోమవారం దినఫలాలు - స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు...

రామన్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ సప్తమి ప.3.51 పునర్వసు పూర్తి సా.వ.5.45 ల 7.25. ప.దు. 12.27 ల 1.16 పు. దు. 2. 53 ల 3.42.
 
మేషం :- ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి వల్ల మాటపడకతప్పదు.
 
వృషభం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు.
 
మిథునం :- దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. బాగా నమ్మే వ్యక్తులే మిమ్ములను మోసం చేసే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.
 
సింహం :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొటారు.
 
కన్య :- వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఉద్యోగములో ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం. సోదరీ, సోదరుల మధ్య సంబంధ భాంధవ్యాలు బాగా ఉంటాయి. రాజకీయ రంగాల వారికి ప్రయాణాలు వాయిదా పడుటమంచిది.
 
తుల :- ఆర్థికలావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. చిట్స్, ఫైనాన్సు సంస్థలల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి గురవుతారు. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 
వృశ్చికం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సొంత వ్యాపారాలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడతాయి. దంపతుల మధ్య కలహాలు, అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
ధనస్సు :- పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మకరం :- కిరణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపార రంగాల్లో వారికి పురోభివృద్ధి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. మీ మాటా, తీరు వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
 
కుంభం :- చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల పనివారికి చికాకులు అధికమవుతాయి. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మీనం :- ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలకు కొత్త కొత్త పథకాలు, ప్రణాలికలు రూపొందిస్తారు. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

తర్వాతి కథనం
Show comments