Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-09-2022 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తుల సమర్థతను, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
 
వృషభం :- రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయలో సంతృప్తి కానరాగలదు. సందర్భానుకూలంగా సంభాషించుట వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మిథునం :- ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సేవా, పుణ్యకార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి.
 
సింహం :- రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధిమవుతయి.
 
కన్య :- భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాలు అనుకూలించవు.
 
తుల :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ విషయాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. 
 
వృశ్చికం :- రాబడికి మంచిన ఖర్చులెదురైనా ఇబ్బందులే మాత్రం ఉండవు. తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అకారణంగా మాటపడవలసి వస్తుంది. ధనం అధికంగా వ్యయం చేసినా ఒక మంచి పని చేసిన తృప్తి ఉంటుంది. సహచరుల సలహా వల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు.
 
ధనస్సు :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు ఆందోళనలు అధికమవుతాయి. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది.
 
మకరం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. వాతావరణంలో మార్పు వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
కుంభం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం, విలువైన వస్తువులను కొనుగోలుచేస్తారు.
 
మీనం :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు నిరుత్సాహం తప్పదు. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నూతన దంపతులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

Vijayashanti: పుష్ప-2 తొక్కిసలాట.. రాజకీయం చేయొద్దు.. విజయశాంతి

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments