Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-07-2024 ఆదివారం రాశిఫలాలు - నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు...

రామన్
ఆదివారం, 14 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ అష్టమి ప.2.11 చిత్త ప.7.57 రా.వ.2.04 ల 3.48. సా.దు. 4.50ల 5.42.
 
మేషం :- ఆధ్యాత్మిక ధోరణి నెలకొంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారు అధికం అవుతున్నారని గమనించండి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. ఆహార విషయాలపై దృష్టి సారించడం అవసరం. షాపింగులో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
 
వృషభం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదా పడతాయి. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయా లేర్పడతాయి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో సమర్థతకనబర్చి అధికారుల గుర్తింపు పొందుతారు.
 
మిథునం :- విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. చింతపండు, ఎండుమిర్చి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చును. స్త్రీలు పనివారితో చికాకులును ఎదుర్కొంటారు. మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు.
 
కర్కాటకం :- మిత్రుల కలయికతో గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్య్వూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. విదేశాలు వెళ్లటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం.
 
సింహం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీశ్రీమతికి నచ్చకపోవచ్చు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థులు కళ, క్రీడా రంగాలలో చురుకుగా పాల్గొంటారు.
 
కన్య :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిసాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటి పాత రుణములు కొన్నింటిని తీరుస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు.
 
తుల :- వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురౌతారు. బంధువుల రాకతో కొన్ని పనులు వాయిదాపడతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- భార్యా భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆకాలభోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల అప్పుడప్పుడు అస్వస్థతకు గురువుతారు.
 
ధనస్సు :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు కాళ్ళు, నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ రాక బంధువులకు ఎంతో ఆందాన్ని ఇస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మకరం :- మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. మీలో దయాగుణం వికసిస్తుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఖచ్చితంగా మెలగాలి. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
 
కుంభం :- వాతావరణంలోని మార్పు ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలోనూ, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. అవకాశాలు కలిసిరాక, పనులు సాగక విసుగు చెందుతారు.
 
మీనం :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులుమీరే చూసుకోవటం ఉత్తమం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరియాలు ఏర్పడతారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

పంచమి తిథి.. వారాహి దేవిని పూజిస్తే అంతా శుభమే.. సమయం?

06-11-2024 బుధవారం రాశిఫలాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. మీ కష్టం ఫలిస్తుంది...

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

తర్వాతి కథనం
Show comments