Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-07-2024 శుక్రవారం దినఫలాలు - వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి...

Advertiesment
Shukra Vakri 2023

రామన్

, శుక్రవారం, 12 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సంII ఆషాఢ శు॥ షష్ఠి ఉ.10.18 ఉత్తర ప.2.54 రా.వ.12.13 ల 1.59. ఉ. దు. 8.09ల 9.01 ప. దు. 12.30 ల 1.22.
 
మేషం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. అవకాశాలు కలిసిరాక, పనులు సాగక విసుగు చెందుతారు. నిరుత్సాహం వీడియత్నాలు సాగించండి. నూతన పెట్టుబడులు, ఉమ్మడి వెంచర్లు ప్రస్తుతానికి అనుకూలం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి సామాన్యం.
 
వృషభం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. అనుకున్న పనులు సకాంలో పూర్తి కాగలవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
మిథునం :- ఆర్థికస్థితి సంతృప్తికరం. భవిష్యత్ అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకుంటారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం లభిస్తుంది.
 
కర్కాటకం :- ఎదుటివారితో మితంగా సంభాషించండి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగయత్నం ప్రోత్సాహకరంగా సాగుతుంది. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
 
సింహం :- ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. ఆనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. రావలసిన ధనం లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆలయాలను సందర్శిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పనులు సాగక విసుగు చెంందుతారు. 
 
కన్య :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. క్రీడా రంగంలో వారికి శుభదాయకం. సాహిత్య సదస్సులలోను, బృందకార్యక్రమాలో చురుకుగా పాల్గొంటారు.
 
తుల :- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. కళా రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. భేషజాలకు పోకుండా ఇతరుల సహాయాన్ని స్వీకరించండి.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. ధనం నీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక ఎటువంటి అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
ధనస్సు :- ప్రత్యర్ధులు మీ శక్తిసామర్ధ్యాలను గుర్తిస్తారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతల నుంచి విముక్తులవుతారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు.
 
మకరం :- తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. ఆలయాలను సందర్శిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు చికాకులు తలెత్తుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది సంతానం మొండి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది.
 
కుంభం :- ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు ఉత్సాహాన్నిస్తుంది. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. సేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి.
 
మీనం :- స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆశాదృక్పథంతో వ్యాపారాలను సాగించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-07-2024 గురువారం దినఫలాలు - ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు....