Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

08-07-2024 – సోమవారం రాశి ఫలితాలు.. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి?

Sagitarus

రామన్

, సోమవారం, 8 జులై 2024 (05:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ తదియ తె.5.20 పుష్యమి ఉ.6.12 రా.వ.7.53 ల 9.36. ప.దు. 12.29 ల 1.21 పు.దు. 3.05 ల 3.57.
 
మేషం:- ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వారికి అశాంతి, చికాకులు అధికము కాగలవు. హోల్ సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. స్టేషనరీ, పింట్రింగ్, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అనుకున్నంత సంతృప్తికానరాదు. ఏదైనా అమ్మాలన్న ఆలోచన క్రియారంలో పెడితే జయం చేకూరుతుంది.
 
మిథునం:- పోస్టల్, కొరియర్ రంగాల్లో వారికి చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి తోటివారి నిర్లక్ష్యం వల్ల సమస్యలు తలెత్తగలవు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి.
 
కర్కాటకం:- రక్షక భటులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. 
 
సింహం:- ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి. మీ సంతానం శుభకార్యాల రీత్యా అధిక ధనం వ్యయం చేస్తారు.
 
కన్య:- మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువుల రాకవల్ల పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగప్రదంగా వుండగలదు. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి.
 
తుల:- - స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి.
 
వృశ్చికం:- బ్యాంకు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
ధనస్సు:- ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోనివారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటు చేసుకుంటుంది.
 
మకరం:- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. మతిమరుపు పెరగటంవల్ల విద్యార్థులకు ఆందోళన పెరుగుతుంది. జీవిత భాగస్వామ్య సలహాలను పాటించండి. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. 
 
కుంభం:- ఆర్ధిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మీనం:- బంధువుల రాకతోఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకుండా సద్వినియోగం చేసుకోండి. ఆశయసాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావించాలి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-07-2024 ఆదివారం దినఫలాలు - శతృవులపై విజయం సాధిస్తారు...