14-06-2022 మంగళవారం రాశిఫలాలు... కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులు, చెల్లింపులు విపరీతంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఓర్పు, నేర్పు ఎంతో అవసరం.
 
మిథునం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం లభిస్తుంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.
 
కర్కాటకం :- భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, దానికి అనునవైన పరిస్థితులు నెలకొంటాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. లౌక్యంగా వ్యవహరించి మీ అవసరాలు చక్కబెట్టుకుంటారు.
 
సింహం :- ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. గృహ మార్పులు, మరమ్మతులు చికాకు పరుస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.
 
కన్య :- కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ కుటుంబీకులపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చుచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడతాయి.
 
వృశ్చికం :- కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం.
 
ధనస్సు :- ప్రముఖుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
మకరం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకం. ప్రతి విషయంలోనూ ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. మిత్రులతో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది.
 
కుంభం :- పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఐరన్, సిమెంట్, ఇసుక, కలప, ఇటుక, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

లేటెస్ట్

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments