Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-08-2023 శుక్రవారం రాశిఫలాలు - పార్వతీదేవిని పూజించిన మనోవాంఛలు ...

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- వృత్తి వ్యాపారాలలో గణనీయమైన మార్పులు కానవస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
వృషభం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి.
 
మిథునం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇవ్వటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. 
 
కర్కాటకం :- ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. దైవారాధన పట్ల ఆశక్తిపెరుగుతుంది. 
 
సింహం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కన్య :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. బంధువుల రాకతో ఖర్చులు అధిమవుతాయి.
 
తుల :- విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకుండా సద్వినియోగం చేసుకోండి. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకం. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు విలవైన కానుకలు ఇచ్చి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. వ్యాపారాల్లో ఒక దానిలో వచ్చిన నష్టం మరొక విధంగా భర్తీ అవుతుంది.
 
ధనస్సు :- మీరు కోరుకున్న రంగంలో విజయం సాధించాలి అంటే మిత్రుల సలహాను పాటించండి. ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో విభేదాలు తలెత్తుతాయి.
 
మకరం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ఇతరులకు హామీలు ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో ఒక దానిలో వచ్చిన నష్టం మరొక విధంగా భర్తీ అవుతుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
కుంభం :- గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆశించినంత ప్రతిఫలం లభించదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనంకొంత మొత్తం అందుకుంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం.
 
మీనం :- ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగములో అదనపు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా కొనసాగుతాయి. ప్రేమికులకు మధ్య విభేదాలు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-10-2024 శుక్రవారం దినఫలితాలు : కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి...

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగులు.. శోభాయాత్ర ప్రారంభం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

తర్వాతి కథనం
Show comments