Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-04-2024 గురువారం దినఫలాలు - ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం...

రామన్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (07:30 IST)
మేషం :- ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. కొబ్బరి, పండ్లు పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
వృషభం :- ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. దైవకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరి ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం :- ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పట్ల ఆస్తి పెరుగుతుంది. ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.
 
కర్కాటకం :- రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉత్తరా ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. ఉదోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి.
 
సింహం :- బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ప్రముఖుల కలయిక ఆశించిన ప్రయోజనం ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగి వున్న పనులు పునః ప్రారంభమవుతాయి.
 
కన్య :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసివస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల :- ఆర్థిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. బంధులను కలుసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులు విద్యార్థులను నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సేవాసంస్థలకు విరాళాలు ఇవ్వటం వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. మీ కొచ్చిన సమస్య చిన్నదే అయినా చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం.
 
ధనస్సు :- మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సహకరిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మకరం :- మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక పరిస్థితికి లోటుండదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి.
 
కుంభం :- ప్రైవేటు సంస్థలలో వారు, సహకార సంఘాలలో వారు పనిలో ఏకాగ్రత వహించలేక పోవుటవలన అధికారులతో మాట పడవలసివస్తుంది. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు యోగప్రదం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మీనం :- శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. దైవకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసివస్తుంది. ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. రియల్ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహనలోపం, చికాకులు అధికమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments