Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-06-2023 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన...

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (04:00 IST)
మేషం :- ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
వృషభం :- ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు.
 
మిథునం :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. చిన్నపాటి ఆనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవల్సి వస్తుంది.
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. వ్యాపార లావాదేవీలు, పన్నుల వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది.
 
సింహం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది.
 
కన్య :- ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించటంమంచిది. మిమ్ములను నిందించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. దంపతుల మధ్య సఖ్యత, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్ననలు పొందుతారు.
 
వృశ్చికం :- మిమ్ములను వ్యతిరేకించిన వారిని సైతం మీ వైపునకు తిప్పుకోగల్గుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్నారుల మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఓర్పు, నేర్పు ఎంతో ముఖ్యం.
 
ధనస్సు :- సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేయగల్గుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
మకరం :- ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. ఖర్చులు అధికమవ్వడం వల్ల ధనం పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని చిరువ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం.
 
మీనం :- స్త్రీల యత్నాలకు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతుంది. మీలోని బలహీనతలను తొలగించుకోవటంపై దృష్టి పెడతారు. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి, పురోభివృద్ధి, కానవస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

Soul Photo: పితృదేవతల పటాలు ఇంట్లో వుంచవచ్చా? వుంచితే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments