Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-06-2023 మంగళవారం రాశిఫలాలు - శ్రీ మహాలక్ష్మీని పూజించిన శుభం...

Advertiesment
Leo
, మంగళవారం, 6 జూన్ 2023 (04:00 IST)
మేషం :- వృత్తి, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. రావలసిన పత్రాలు, రశీదులు అందకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, దానికి అనునవైన పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కార్యక్రమాలు నిర్విగ్నముగా సాగుతాయి.
 
వృషభం :- ఆర్ధిక స్థితి మారుతుంది. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రియమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణాలు తీరుస్తారు. కొత్త రంగాలలో ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి.
 
మిథునం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ముక్కుసూటిగాపోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన దంపతులు పరస్పరం మరింత చేరువవుతారు. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కర్కాటకం :- రాజకీయాలలో వారికి సంఘంలోస్తాయి పెరుగగలదు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. కుటుంబీకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది.
 
సింహం :- కీలకమైన వ్యవహరాల్లో పెద్దల సలహా పాటించటం మంచిది. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలకు తల, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పనులకు ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
కన్య :- ఆర్ధిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
తుల :- అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ సంతానం విద్యావిషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు టివి ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు పెరుగినా ఆర్ధికంగా మెరిగైన స్థితిలోనే ఉంటారు. పాత మిత్రుల కలయికతో మీలోమార్పు వస్తుంది.
 
వృశ్చికం :- రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి.
 
ధనస్సు :- స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. చిన్ననాటివ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు, సంస్థల అభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది.
 
మకరం :- హోటలు, తినుబండ వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. సామార్థ్యం, అంకితభావం ప్రదర్శించి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటారు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం :- ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఖర్చులు బాగా పెరిగే అస్కారం ఉంది. ఎ.సి. కూలర్ మెకానిక్ రంగాలలో వారిక సంతృప్తి, పురోభివృద్ధి, కానవస్తుంది. బంధువుల రాకతో స్త్రీలు కొంత అసౌకర్యానికి లోనవుతారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం :- ఆర్ధిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. గృహంలో స్వల్ప మార్పులు చేపడతారు. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రతచాలా అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతకంలో దోషం వుంటే.. సోమవారం స్వయంవర మంత్రాన్ని పఠిస్తే..?