Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-06-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా..?

Advertiesment
Puja
, ఆదివారం, 4 జూన్ 2023 (05:33 IST)
సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది.
 
మేషం:- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకుల తీరు ఆందోళన కలిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
మిథునం:- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం:– ఆర్ధిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు.
 
సింహం:- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇల్లు కానీ, ఆఫీసు కానీ మారాల్సి రావచ్చు. ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది.
 
కన్య:- ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వటం మంచిది కాదు. మిత్రుల ప్రయోజనాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. విందులలో పరిమితి పాటించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి.
 
తుల:- వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో మాటపడవలసివస్తుంది. సంతానం పై చదువులపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల సలహా పాటించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
 
వృశ్చికం:- ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
ధనస్సు:- ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సహకరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. వ్యవసాయ, ఎగుమతి, దిగుమలు లాభిస్తాయి.
 
మకరం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో కలసి విందు, వేడుకలలో పాల్గొంటారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శక మవుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
కుంభం:- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం ఏ మాత్రం నిలవ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక చర్చలలో అనుకూలతలుంటాయి. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి.
 
మీనం:- నూనె, పెట్రోలు, డీజిల్ వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి కానరాగలదు. ఎప్పటినుండో ఆగివున్నపనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. స్కీమ్‌లు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-06-2023 నుంచి 10-06-2023 వరకు వార రాశిఫలితాలు