Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-06-2023 శనివారం రాశిఫలాలు - పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించిన...

Advertiesment
Cancer
, శనివారం, 3 జూన్ 2023 (04:00 IST)
మేషం :- కుటుంబంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు అలస్యంగా అమలుపరుస్తారు. పరస్త్రీలతో జాగ్రత్తగా ఉండుట మంచిది. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. ధర్మకార్యాలయందు ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- అవివాహితులకు త్వరలోనే దూర ప్రాంతాల నుండి సంబంధాలు ఖాయమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వ్యాపారంలో అధిక లాభాలను గడిస్తారు. విజ్ఞాన విహార యాత్రలపట్ల ఏకాగ్రత వహిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి.
 
మిథునం :- ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యుత్ లోపం వల్ల చికాకులకు లోనవుతారు. వైద్యుని సలహా తప్పదు. అనుకోని కలహాలకు అవకాశం ఉంటుంది. ఊహించిన ఖర్చులు అధికమవుతాయి. అరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా సమసిపోతాయి. 
 
కర్కాటకం :- పానీయ వ్యాపారుస్తులకు, కొబ్బరి వ్యాపారుస్తులకు కలిసివస్తుంది. బంధువుల రాకతో మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో ధనం పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
సింహం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవరసం. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇబ్బందిపెట్టటానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ రంగాలలో వారికి, గృహంలో మార్పులు చేర్పులకు ఇది సరియైన సమయం.
 
కన్య :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యవసాయ తోటల రంగాల వారికి కొబ్బరి, పండ్ల పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు కలిసిరాగలదు. పెద్దలను, ప్రముఖులను సుముఖం చేసుకుంటారు. వాగ్దానాలు చేసి సమస్యలను ఎదుర్కొంటారు. 
 
తుల :- మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ది పొందడానికి ప్రయత్నిస్తారు. అప్పుడప్పుడు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థునులకు పురోభివృద్ధి. రియల్ ఎస్టేట్, బ్రోకర్లకు అశించినంత ఫలితాలు ఉండవు. రుణం ఏ కొంత అయిన తీర్చుతారు. మీ హావభావాలు, ఆలోచనలు, బయటికి వ్యక్తం చేయకండి.
 
వృశ్చికం :- ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ధనకాంక్ష అధికమవ్వడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. వస్త్ర, వెండి, బంగారు, లోహ వ్యాపారస్తులకు ఆశాజనకం. వాహన చోదకులకు చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. హామీలు ఉండి సమస్యలు తెచ్చుకోకండి.
 
ధనస్సు :- ఆల్కహాలు, మందులు, ఎరువులు ఫ్యాన్సీ వ్యాపారుస్తులకు కలిసివస్తుంది. స్థిర చరాస్తులపట్ల ఏకాగ్రత వహిస్తారు. చేతి పనివారికి వృత్తుల వారికి లాభదాయంగా ఉండగలదు. స్త్రీలకు మనోధైర్యం తగ్గుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలలోని వారికి రాబడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మకరం :- ఆలయాలను సందర్శిస్తారు. హోటల్ తినుబండారు వ్యాపారులకు సంతృప్తికరంగా ఉంటుంది. అధిక శ్రమ త్రిప్పట వంటివి ఎదుర్కొంటారు. క్రీడా రంగంలోని వారికి సత్ ఫలితాలు ఉండగలవు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
కుంభం :- కిరణా, ఫాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నూతన వ్యక్తుల పరియచం మీకు ఎంతో సంతృప్తి నివ్వగలదు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ముఖ్యులకు బహుమతులను అందజేస్తారు. ఎదుటివారితో సత్సంబంధ బాంధవ్యాలు కొనసాగించండి.
 
మీనం :- రావలసిన ధనం సకాలంలో అందుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అనురాగ వాత్సాలాలు పొందుతాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేసి సంభాషించకండి. కిరాణా, హోటల్, తినుబండారు వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే.. భైరవుడి విభూతిని...?