Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-10-2022 ఆదివారం దినఫలాలు-ఆదిత్య హృదయం చదివినా విన్నా..?

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (05:00 IST)
ఆదివారం ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం:- ఉద్యోగస్తులు సహోద్యోగులతో కలిసి విందు, వేడుకలలో పాల్గొంటారు. మీ శ్రీమతిని సలహా అడగటం శ్రేయస్కరం. తోటివారి సహాకారంవల్ల మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అసవరం. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
వృషభం :- చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. మీ సంతానంతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనిలో సమయపాలన,పరస్పర అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
 
మిథునం:- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. దైవ కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కీలక సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్నారులకు శుభా కాంక్షలు తెలియజేస్తారు.
 
కర్కాటకం:- మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. దైవ బలంతో కష్టాలను అధిగమిస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొన వలసివస్తుంది.
 
సింహం:- స్త్రీల మతిమరుపు నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. ప్రయాణాలలో జయం చేకూరుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కన్య:- ఆర్ధిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ ముక్తసరి పలకరింపు బంధువులను నిరుత్సాహ పరుస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహనాలోపం.
 
తుల:- ఆడంబరాలు, వ్యసనాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకుఎంతో చికాకు కలిగిస్తుంది. ఇష్ట దైవాన్ని స్తుతించినా సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. విద్యార్థులు బయటితినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
వృశ్చికం:- దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. మీ సంకల్పసిద్ధికి నిరంతరశ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల మరచిపోయే ఆస్కారం ఉంది.
 
ధనుస్సు:- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయం. ధనం బాగా అందుటవలన ఏ కొంతయినా నిల్వచేయగలుగుతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. లౌక్యంగా వ్యవహారిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
మకరం:- బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటు చేసుకుంటాయి. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రేమికులు అతిగా వ్యవహారించడం వల్ల చిక్కుల్లో పడతారు. సినిమా, కళంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ధనం చేతికందుతుంది. 
 
కుంభం:- విఘ్నాలను అధిగమించే ఆలోచనలు చేయవలసి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పుణ్య కార్య క్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మీనం:- గృహ నిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!!

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments