Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-12-2023 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (04:00 IST)
మేషం :- ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రభుత్వ సంస్థల్లో వారుకొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు.
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి చికాకు తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
మిథునం :- నూతన వ్యక్తులతో స్త్రీలు అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. వృత్తుల్లో వారు, వైద్యులు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారస్తులకు శుభం, జయం చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
సింహం :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సిమెంటు, కలప, ఇటుక వ్యాపారస్తులకు గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి చికాకు తప్పదు.
 
కన్య :- దంపతుల మధ్య కలహాలు తలెత్తగలవు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సలహా తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల రాక మీతో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సలహాతో నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల వైపు కొనసాగుతాయి.
 
వృశ్చికం :- ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. హోటలు, తినుబండ, కేటరింగ్ రంగాలలో వారికి కలిసిరాగలదు. ఉద్యోగస్తులు, అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు.
 
ధనస్సు :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడవలసి వస్తుంది. కుటింబీకుల కోసం ధనం బాగావ్యయం చేస్తారు. మీ తోందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో ఆవేదన కలిగిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిదికాదు. దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.
 
కుంభం :- బంధువుల రాకతో ఊహించని ఖర్చులు మీదపడటంతో రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
మీనం :- నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలివైన లక్షణం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

తర్వాతి కథనం
Show comments