Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-11-2023 గురువారం దినఫలాలు - లక్ష్మీ కుబేరుడిని పూజించిన సర్వదా శుభం...

Advertiesment
astrolgy
, గురువారం, 30 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ|| తదియ ప.2.07 ఆరుద్ర ప.3.33 తె.వ.4.19 ల 6.01. ఉ.దు. 9.49 ల 10.35 ప. దు. 2. 23ల3.09.
 
లక్ష్మీ కుబేరుడిని పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. విద్యార్థులు బహుమతులు అందుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. క్రయ విక్రయాలు సామాన్యం. 
 
వృషభం :- సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు, చెల్లింపులలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వస్త్ర, వస్తు ప్రాప్తి, వాహనయోగం వంటి శుభ ఫలితాలుంటాయి. ఎదుటివారి తీరు ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
మిథునం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావంచూపుతాయి. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనలు కొత్త అనుభూతినిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సునువ్యాకుల పరుస్తాయి.
 
కర్కాటకం :- మీ ఆంతరంగిక విషయాలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. పారిశ్రామిక 
రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పదు. పాత బిల్లులు చెల్లిస్తారు. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
సింహం :- రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి ధనం చేతికందుతుంది. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడారు. ఆస్తివ్యవహారాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
 
తుల :- ఉపాధ్యాయులు గౌరవ పురస్కారాలు వంటివి పొందుతారు. ప్రేమికులకు ప్రతి విషయంలోను ఆలోచన, అవగాహన ముఖ్యం. సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయనాయకులు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కీలకమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీ శ్రీమతికినచ్చదు.
 
వృశ్చికం :- స్త్రీలకు బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. సొంత వ్యాపారాల పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు. ఆల్కహాలు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. విద్యార్థులు పరీక్షలు, క్రీడలు, క్విజ్ వంటి పోటీల్లో రాణిస్తారు. శారీరకశ్రమ, పని ఒత్తిడి వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల కలయికతో ఒకసమస్య మీకు అనుకూలంగా పరిష్కారం కాగలదు. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులు బహుమతులు అందుకుంటారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
మకరం :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. మీపై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి. దీర్ఘకాలిక మదుపు పథకాల విషయంలో పునరాలోచన అవసరం. విద్యార్థులు తోటి విద్యార్థులతో ఉల్సాసంగా గడుపుతారు.
 
కుంభం :- ఏ విషయంలోను దంపతుల మధ్య దాపరికంమంచిది కాదని గమనించండి. ఆత్మస్థయిర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులకు సంతృప్తి కావస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ శ్రమ, యత్నాలు వృధాకావు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం :- మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయంలేకుండా జాగ్రత్త వహించండి. షేర్లు, స్థిరాస్తులక్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. బిల్డర్లకు పనివారలతో చికాకులుతప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-11-2023 బుధవారం రాశిఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...