Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-12-2023 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది...

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ|| సప్తమి రా.8.28 మఘ రా.11.57 ఉ.వ. 10.41 ల 12.27. ప.దు. 12.11 ల 12.55 పు.దు. 2.23ల3.07
ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులవల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు ఆశించినంతగా సాగవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు చుట్టుపక్కల వారి నుండి గౌరవం, ఆదరణ పొందుతారు. వ్యాపారపరంగా ఇంకాస్త ముందుకు వెళ్లి, లాభాలు గడిస్తారు. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరించడి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
 
కర్కాటకం :- కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం అన్నివిధాలా శ్రేయస్కరం. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. సభలు, సమావేశాల్లోమీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటంక్షేమదాయకం.
 
సింహం :- ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రాజకీయ నాయకులు ప్రముఖులతో చర్చలు జరుపుతారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు పురోభివృద్ధి. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారంఉంది.
 
తుల :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు చేయాలన్నమీ కోరిక ఫలించదు.
 
వృశ్చికం :- ఆర్థికంగా మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. తరచు సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
 
ధనస్సు :- వస్త్ర, బంగారు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. స్త్రీలకు ఆకస్మికంగా పొట్ట, తలకి సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం.
 
మకరం :- రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉన్నదాంతో సంతృప్తి చెందాలనే మీ భావం కుటుంబీకులకు నచ్చదు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఇతరులముందు వ్యక్తి గత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. పెద్దలకు అప్పుడప్పుడు వైద్య సేవ తప్పదు.
 
మీనం :- ఉపాధ్యాయులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికిమార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?

06-09-2024 శుక్రవారం రాశిఫలాలు - మీ కష్టం ఫలిస్తుంది.. ఉల్లాసంగా గడుపుతారు...

వినాయక చవితి 2024: 21 పత్రాలు.. ఎరుపు రంగు దుస్తులు..?

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

05-09-2024 గురువారం దినఫలితాలు - ఆ రాశివారికి ఖర్చులు సామాన్యం..

తర్వాతి కథనం
Show comments