Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

రామన్
ఆదివారం, 4 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతితో అకారణ కలహం. అపరిచితులతో మితంగా సంభాషించండి. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ విముక్తులవుతారు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దుబారా ఖర్చులు విపరీతం ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. దైవకార్యానికి ఖర్చు చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు పురమాయించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతల అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. కష్టించినా ఫలితం ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అవకాలను కలిసివస్తాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యతలోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. 
 
తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. పట్టుదలకు పోయి అవకాశాలను చేజార్చుకుంటారు. విందులు, వేడుకకు హాజరుకాలేరు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులకు సాయం చేస్తారు. అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

తర్వాతి కథనం
Show comments