Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-08-2023 గురువారం రాశిఫలాలు - శ్రీ దత్తాత్రేయుడని ఆరాధించిన సంకల్పం సిద్ధి

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (04:09 IST)
మేషం :- ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి.
 
వృషభం :- స్త్రీలు షాపింగ్, విందు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ట్రాన్స‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమాధిక్యత కానవచ్చిన సత్ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మిథునం :- ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ఖర్చులు, అవసరాలు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. విద్యార్థులకు సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.
 
కర్కాటకం :- స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోనివారి శ్రమకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. సమయానికి మిత్రులు సహకరించకపోవటంతో అసహనానికి గురవుతారు.
 
సింహం :- చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఐరన్, సిమెంటు, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. స్వాతంత్ర్య నిర్ణయాలు చేసుకొనుట వలన శుభం చేకూర గలదు.
 
కన్య :- స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికమతున్నారని గమనించండి.
 
తుల :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి.
 
వృశ్చికం :- రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీలు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు.
 
ధనస్సు :- బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పొల్గొంటారు.
 
మకరం :- మీ సమర్థతపై ఎదుటివారికి విశ్వాసం ఏర్పడుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. రాజకీయనాయకులకు ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. స్త్రీలు చుట్టుపక్కల వారి నుండి గౌరవం, ఆదరణలభిస్తుంది.
 
మీనం :- స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కాగలదు. మీ మొండివైఖరి వదిలి ప్రశాంత వహించుట మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగులు.. శోభాయాత్ర ప్రారంభం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

01-10-2024 నుంచి 31-10-2024 వరకు మీ మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments