Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-08-2022 సోమవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులు తోటివారిని ఓ కంట కనిపెట్టటం మంచిది. నిరుద్యోగులకు లభించిన అవకాశం స్పల్పమైనదే అయినా సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. చేతివృత్తులు, చిరువ్యాపారులకు కలిసి రాగలదు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవరోధాలు అధికమిస్తారు.
 
వృషభం :- ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఆశాజనకం. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాల వల్ల స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- ఉద్యోగస్తులు తోటివారి నుండి కొత్త విషయాలు గ్రహిస్తారు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం వల్ల ఆందోళన తప్పదు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. పాత రుణాలు తీరుస్తారు.
 
కర్కాటకం :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఉన్నతినిచాటు కోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయటం మంచిదికాదని గమనించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
సింహం :- దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలు చీటికి, మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. రాజకీయాలలోని వారికి పార్టీపరంగా, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఆకర్షణీయమైన స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. భాగస్వామిక చర్చలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు.
 
తుల :- బంధువుల రాకతో పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలు అధికం. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతంకాకుండా జాగ్రత్త పడండి. ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారం కలదు.
 
వృశ్చికం :- కిరణా, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలం కాగలదు. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. అపరిచితులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం.
 
ధనస్సు :- కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యా వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
మకరం :- విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు, వృత్తుల వారికి కలిసిరాగలదు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆధికారులతో ఏకీభావం కుదరదు.
 
కుంభం :- వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం, చిరు వ్యాపారులకు ఆశాజనకం. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఇతరులకు వాహనం ఇవ్వడంవల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు అదనపు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. వైద్య సలహా, ఔషధ సేవనం తప్పదు. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

లేటెస్ట్

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

తర్వాతి కథనం
Show comments