మేషం :- బంధు మిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపంవల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది.
వృషభం :- దైవకార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యం వైపు దృష్టి సారిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు.
మిథునం :- వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు, నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బకాయిలు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు అధికం అవుతున్నారనిగ్రహించండి.
కర్కాటకం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాదోపవాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం అందటం వల్ల పాత బాకీలు తీరుస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిది.
సింహం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో సంభాషించేటపుడు మెళకువ అవసరం. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
కన్య :- ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల చికాకులు, పనిభారం తప్పవు. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు.
తుల :- ఉద్యోగస్తులు తరుచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ, చెల్లింపులలోను అప్రమత్తత చాలా అవసరం. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
వృశ్చికం :- విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత పురోభివృద్ధి, పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ధనస్సు :- ఒంటెత్తు పోకడ మంచిది కాదు గమనించండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృది. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తికానరాదు. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.
మకరం :- ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అసహనానికి లోనవుతారు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం ఒకందుకు మంచిదే. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌వకు సదావకాశాలు లభిస్తాయి.
కుంభం :- జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. మీ పట్ల ముభావంగా ఉండి వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు.
మీనం :- విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీసంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. కళ, క్రీడారంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం.