Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26-07-2022 మంగళవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా...

Weekly Astrology
, మంగళవారం, 26 జులై 2022 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలను పనివారితో చికాకులు తప్పవు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఎదుటివారిని మా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
వృషభం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అసవరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు.
 
మిథునం :- ఒక కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.
 
కర్కాటకం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.
 
సింహం :- ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడక తప్పదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. అధిక ధనంతో దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. కోర్టు వ్యవహరాలు పరిష్కారమవుతాయి.
 
కన్య :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రైవేటు,పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. దంపతులకు ఏ విషయంలోను పొత్తుకుదరదు.
 
తుల :- గృహంలో మార్పులు వాయిదా పడతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలోరాణిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాల్లో మెలకువ వహించండి. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
మకరం :- ఆదాయ వ్యయాలు సామానంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్ధులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెలకువ వహించండి.
 
కుంభం :- భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
మీనం :- ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చు కోవలసి ఉంటుంది. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ప్రయాణాల్లో మెలకువ వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-07-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...