Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-08-2024 గురువారం రాశిఫలాలు - ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు...

రామన్
గురువారం, 1 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ॥ ద్వాదశి సా.4.18 మృగశిర ప.12.13 రా.వ.8.38 ల 10.14. ఉ.దు. 9.58 ల 10.49 ప.దు. 3. 05 ల 3.57.
 
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మీలో వచ్చిన మార్పును మీ కుటుంబీకులు గుర్తిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రుణాలు, పన్నులు సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
 
మిథునం :- వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. సంప్రదింపులు, వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
సింహం :- చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల పని వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబీకుల నుండి, మిత్రుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. నిర్మాణ పనులలో స్వయం వీక్షణ చాలా అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
 
కన్య :- శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. బంధు మిత్రుల కలయితో మానసికంగా కుదుటపడతారు.
 
తుల :- గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు, వారసత్వ సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు క్రీడ, కళారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
వృశ్చికం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు.
 
ధనస్సు :- ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఫీజులు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కుటుంబంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీ అనుకూలిస్తాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
 
మకరం :- ఆదాయ వ్యయాలు అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం.
 
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుండి సమస్యలు తలెత్తుతాయి. మీ కుటుంబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. 
 
మీనం :- చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments