Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

రామన్
ఆదివారం, 1 జూన్ 2025 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. అపజయాలకు కుంగిపోవద్దు. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా అడుగేయాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పధంతో మెలగండి. కలిసివచ్చిన అవకాశం వదులుకోడద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పరిచయస్తులతో సంభాషిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటననలెదురవుతాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల బాధ్యతలు చేపట్టవద్దు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. హామీలు నిలబెట్టుకుంటారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. ఖర్చులు సామాన్యం. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. ఎవరినీ నొప్పించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

తర్వాతి కథనం
Show comments