Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Advertiesment
Astrology

రామన్

, మంగళవారం, 27 మే 2025 (22:18 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు సానుకూలమవుతాయి. సమస్య సద్దుమణుగుతుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాసవస్తువులు కొనుగోలుచేస్తారు. పత్రాలు, రశీదలు జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్త పనులు మొదలెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనులు అప్పగించవద్దు. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ధృఢసంకల్పంతో అడుగు ముందుకేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. ఎవరి సాయం ఆశించవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్వయంకృషితో కార్యం సాధిస్తారు. మీ పట్టుదలే విజయానికి దోహదపడుతుంది. రావలసిన ధనం అందుతుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా మంచే జరుగుతుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి.
చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక నిర్ణయం తీసుకుంటారు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?