జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసుకుందాం. శ్రీలక్ష్మి అనుగ్రహం పొందిన రాశుల వారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఈ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు సంపదలకు, సంతోషానికి కారకుడు. ఈ రాశుల వారికి శ్రీదేవి అనుగ్రహం చేకూరుతుంది. వీరికి ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి వుంటుంది.
సింహ రాశి వారికి శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఈ జాతకులకు దృఢమైన మనస్సు, బుద్ధికుశలత చేకూరుతుంది. వీరికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే వృశ్చిక రాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా వరిస్తుంది. వీరికి లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక ఇబ్బందులు వుండవు.
ఇకపోతే, తులారాశి వారు శ్రీలక్ష్మీ అనుగ్రహానికి కొదవ వుండదు. వీరి కఠినంగా శ్రమించే వారు. అంకితభావం ఎక్కువ. లక్ష్మీదేవి కటాక్షంతో వీరి చేతిలో డబ్బు ఎప్పుడూ వుంటుంది. జీవితంలో సర్వసుఖాలను అనుభవిస్తారు. ఆడంబర జీవనం గడుపుతారు.
ఇంకా సింహరాశి జాతకులకు శ్రీ లక్ష్మి అనుగ్రహం కారణంగా ప్రతి కార్యంలో విజయం వరిస్తుంది. అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చివరిగా మీనరాశి వారికి ఆ అష్టలక్ష్మీదేవి అనుగ్రహం ఖాయం. వీరు కఠోరశ్రమతో తలపెట్టిన కార్యాలను ముగించేంతవరకు వదిలిపెట్టరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.