Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

Advertiesment
Astrology

రామన్

, ఆదివారం, 25 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉంటానికి యత్నించండి. సన్నిహితులతో సంభాషిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు పురమాయించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు వేగవంతమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేస్తున్న పనులు అర్థాంతంగా ముగిస్తారు. నోటీసులు అందుకుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారం అనుకూలిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఊహించని ఖర్చు ఎదురవుతుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆప్తులతో రాలక్షేపం చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకరండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు కొనసాగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు