Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-06-2021 సోమవారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణం చేస్తే...

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. శ్రీమతి, శ్రీవారుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. 
 
వృషభం : బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. ప్రైవేటు విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
మిథునం : చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహిరించుకుంటారు. 
 
కర్కాటకం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు కార్మికులతో సమస్యలు, అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, ప్రమోషన్ వంటి శుభపరిణామాలున్నాయి. 
 
సింహం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వృత్తి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు ఆస్కారం వుంది. బంధువుల ఆకస్మిక రాకతో ఊహించని ఖర్చులు ఉంటాయి. 
 
కన్య : పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు తల కాళ్లు నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
తుల : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి విమర్శలు తప్పవు. సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను అధికంగా ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం :  స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఏ పని యందు ధ్యాస ఉండదు. పదవీ విమరణ చేసిన వారికి రావలసిన గ్యాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. 
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నంలో పునరాలోచన మంచిది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షంగా ఉంటుంది. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. 
 
మకరం : ఆదాయ వ్యాయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. గృహమునకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా పరిష్కరిస్తారు. విద్యార్థులకు కొత్త వాతావరణం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. 
 
కుంభం : పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంల చికాకులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
మీనం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments