Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-02-2020 మంగళవారం మీ రాశి ఫలితాలు

Daily Horoscope
Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (05:00 IST)
Karthikeya
కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మేషం: ఉద్యోగస్తులకు విశ్రాంతి కరువవుతుంది. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంత శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
వృషభం: భూములకు సంబంధించి తుది ఒప్పందాలు చేసుకుంటారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
మిథునం: ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాల నివ్వగలవు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది.
 
కర్కాటకం: మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
సింహం: స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. విద్యార్థులలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి వుంటుంది.
 
కన్య: గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. దైవ, శుభకార్యాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
తుల: వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తులాభం, వాహనయోగం వంటి శుభఫలితాలు పొందుతారు. బిల్లులు చెల్లిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృశ్చికం: విదేశీయానం, రుణ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
ధనస్సు: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి శ్రమాధిక్యత తప్పవు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. 
 
మకరం: ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ అవసరం. వ్యవసాయం పరికరాల కొనుగోళ్లు చేస్తారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. 
 
కుంభం: బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు ఆహ్వానాలు, వస్త్ర, వస్తులాభం వంటి శుభఫలితాలుంటాయి. వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక చర్చల్లో అనుకూలతలుంటాయి. మిత్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
మీనం: గృహ నిర్మాణం, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తలగడంతో పొదుపు సాధ్యం కాదు. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

తర్వాతి కథనం
Show comments