Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-12-2020 బుధవారం దినఫలాలు - నరసింహ స్వామిని ఆరాధిస్తే సంకల్ప సిద్ధి (video)

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనిస్తాయి. స్త్రీలకు బంధువుల ఆదరణ, మర్యాదలు సంతృప్తినిస్తాయి. 
 
వృషభం : ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలు ఉండటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
మిథునం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎప్పటి సమస్యలు అపుడే పరిష్కరించడం మంచిది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆకస్మిక చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఆర్థిక కుటుంబం సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. మీ సంతానం విషయంలో సంతృప్తికానవస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం : మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. బదిలీలపై వచ్చిన అధికారులకు ఉద్యోగుల సత్కారం, సహాయ సహకారాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కావలసిన ధనం చేతికందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
కన్య : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలో మెళకువ అవసరం. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. సన్నిహితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. 
 
తుల : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. 
 
వృశ్చికం : ఒక మంచి పని చేశామన్న సంతృప్తి మీలో నెలకొంటుంది. ప్రముఖులను కలిసి బహుమతులను అందజేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. పాత రుణాలు తీరుస్తారు. 
 
ధనస్సు : కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సహోద్యోగులకు ఆశాజనకం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకలు ప్రోత్సాహం లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు.
 
మకరం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగి జయం పొందండి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం : కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. తోటల కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు. పెరుగుతున్న ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. ఎరువులు, క్రిమి సంహారకం మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. 
 
మీనం : ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. ప్రియతములు, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments