Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-09-2020 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజిస్తే..

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఇబ్బందులు తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
వృషభం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల మొండివైకరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. రచయితలకు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు లభిస్తుంది. స్త్రీలకు నరాలు, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. 
 
కర్కాటకం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభించగలవు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నిరుద్యోగులు ఇంర్వ్యూలలో జయం పొందుతారు. 
 
సింహం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి అనుభవం గడిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు కొంతమంది యత్నిస్తారు. 
 
కన్య : బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం లభిస్తుంది. చేపట్టిన పనులు ఏమాత్రం మందుకు సాగవు. కొంతమంది మ మాటలను అపార్థం చేసుకుంటారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. 
 
వృశ్చికం : రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు, చెల్లింపుల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. అసాధ్యమనుకున్న వ్యవహారం సానుకూలమవుతుంది. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. 
 
ధనస్సు : భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కొంటారు. 
 
మకరం : లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లుకు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఉన్నతిని చూసి బంధువులు అసూయపడే ఆస్కారం ఉంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వాహన నడుపుతున్నపుడు మెళకువ వహించండి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం క్షేమదాయకం. నిరుద్యోగులకు ఆశాజనకం. 
 
మీనం : ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ బలహీనతలు, ఆగ్రహావేశాలు ఇబ్బందులకు దారితీసే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు అధికమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

Wife: భర్త వేధింపులు.. తాగొచ్చాడు.. అంతే కర్రతో కొట్టి చంపేసిన భార్య

Floodwater: కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు తగ్గుముఖం.. ప్రఖార్ జైన్

ఏపీకి ఎక్కువ.. తెలంగాణకు తక్కువ.. రేవంతన్న ఎన్ని తంటాలు పడినా?

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

అన్నీ చూడండి

లేటెస్ట్

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

Daily Horoscope: 30-09-2025 మంగళవారం ఫలితాలు- మిమ్ముల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు

Mercury transit 2025: బుధ గ్రహ పరివర్తనం.. ఈ రాశుల వారికి లాభదాయకం

తర్వాతి కథనం
Show comments