Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-06-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టదేవతను ఆరాధించినా...

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (04:00 IST)
మేషం : కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. శత్రువులు, మిత్రులుగా మారతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
వృషభం : ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలు అధికారులు గుర్తిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. 
 
మిథునం : ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారమార్గం గోచరిస్తుంది. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. కానివేళలో బంధు మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కర్కాటకం : మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తిచేస్తారు. 
 
సింహం : ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి వేధింపులు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులను కలిగిస్తాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. బేకరీ, స్వీట్స్ తినుబండారు వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
కన్య : కొబ్బరి, మామిడి, పండ్లు, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
తుల : నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలలోని వారికి సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం : బంధు మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. వాహన చోదకులకు చికాకులు అధికం. 
 
ధనస్సు : సభలు, సమావేశాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయిల పెరగగలదు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మకరం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలతో  సంభాషించేటపుడు సంయమనం పాటించండి. సోదరీ, సోదరుల మధ్య పోరు అధికంగా ఉంటుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
కుంభం : అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయం సాధించిన రోజు దూరమైన వారు తప్పక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. పీచు, ఫోం, లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. భార్య, భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం, చికాకులను ఎదుర్కొంటారు. 
 
మీనం : పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ ఏమరుపాటుతనం వల్ల ధన నష్టం, విలువైన వస్తువులు చేజారిపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments