Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-04-2021 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరిని పూజించడం వల్ల...

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:00 IST)
మేషం : వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. ధనవ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. బంధు మిత్రులతో ఓర్పు, సంయమనంతో మెలగండి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మిథునం : కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆశించిన రీతిగా ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేస్తారు. ఆడిట్స్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ కదలికలపై కొంతమంది కన్నేసిన విషయం గమనించండి.
 
కర్కాటకం : రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఇసుకు, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
సింహం : మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిదికాదు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కొబ్బరి, పండ్లు, చిరు, వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. 
 
కన్య : యాదృశ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆకానొక విషయంలో బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
తుల : పత్రికా సిబ్బందికి ఒత్తిడి పనిభారం అధికం. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు అధికం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : దేనికీ తొందరపడొద్దు. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలం. ఊహించని సంఘటనలు సైతం ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉండండి. ఏది ఎలా జరిగితే అలాగే జరగనివ్వండి.
 
ధనస్సు : రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకుసాగండి. 
 
మకరం : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
కుంభం : బ్యాంకింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. పెద్ద ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సన్నిహితుల సలహాతో కొన్ని పనులు చేపట్టి పూర్తిచేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
మీనం : మీ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మెళకువ అవసరం. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యుల కలయికను గోప్యంగా ఉంచడం మంచిది. కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments