Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

04-04-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో..?

webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (05:00 IST)
శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం: పత్రకా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కొత్త వ్యక్తుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. 
 
వృషభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఇంటాబయటా కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. 
 
మిథునం: సిమెంట్ స్టాకిస్టులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కర్కాటకం: స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. బంధుమిత్రుల కలయిక మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. హోటల్, తినుబండారాల వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. 
 
సింహం: వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. నోరు అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. 
 
కన్య: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి.
 
తుల: స్త్రీలు విందు వినోదాల్లో చురుకుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. సోదరీ సోదరులతో ఏకీభవించలేకపోతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం: మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. స్త్రీల వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొంటారు. గృహంలో ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. 
 
ధనస్సు: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోటల్, క్యాటరింగ్ పనివారికి కలిసిరాగలదు. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. 
 
మకరం: పాత మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.
 
కుంభం: గృహానికి కావలసిన వస్తువులను కొంటారు. ఆత్మీయులను విమర్శించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు ధరలు అధికమవుతాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం వుంది. మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం: మధ్యవర్తిత్వం వహించడం మంచిది కాదు. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయం అవుతుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే