Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-04-2021 గురువారం దినఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే...

Advertiesment
01-04-2021 గురువారం దినఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే...
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : స్త్రీలకు బంధువుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. సోదరీ సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యమజాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
వృషభం : భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణలు, పరిశ్రమల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరుకాగలవు. ఉద్యోగస్తుల పై అధికారులను మెప్పిస్తారు. మీ కార్యక్రమాలు పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. 
 
మిథునం : వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించుట మంచిది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. క్యాటరింగ్ పనివారలు చేతి వృత్తుల వారికి ఆశాజనకం. ప్రముఖుల సహాయంతో ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. 
 
కర్కాటకం : రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. రుణబాధలు వంటివి తీర్చగలవు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మిత్రుల సహకారంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. 
 
సింహం : ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. వ్యాపారాలకు కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. గత అనుభవాలు గుర్తుకువస్తాయి. 
 
కన్య : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
తుల : ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. భవిష్యత్ ప్రణాళిలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. కొన్ని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. స్త్రీలకు బంధువుల రాకవల్ల ఒత్తిడి, పనిభారం అధికం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. 
 
వృశ్చికం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కొత్త సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. 
 
ధనస్సు : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి తప్పదు. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వహించే ప్రయత్నం చేయండి. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. పైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. 
 
మకరం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. చిన్నతహా పరిశ్రమలలో వారికి అనుకూలత. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. అవసరమైన వస్తువులు సమయానికి కనిపించకపోవుట వల్ల ఆందోళన చెందుతారు. 
 
కుంభం : ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వహించే ప్రయత్నం చేయండి. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు, ధనసహాయం విషయంలో మెళకువ అవసరం. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
మీనం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులకు షాకిచ్చిన తితిదే : అలాంటి భక్తులు కొండపైకి రావొద్దంటూ... (Video)