Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-11-2020 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఆరాధించినా సంకల్ప సిద్ధి

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (05:00 IST)
మేషం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సంతానం మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు తప్పవు. మీ పట్ల ముభావంగా వ్యవహరించిన వారు మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లోపిస్తుంది. 
 
వృషభం : స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు స్కీంలు, ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. సోదరీ, సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు.
 
మిథునం : ఇంటా, బయటా మీ మాటకు ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. హోటల్, క్యాటరింగ్, పనివారలకు పురోభివృద్ధి. మీ సంతానం అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. స్త్రీలు ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. కీలకమైన వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. మిత్రుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రుణాలు చేబదుళ్లకు యత్నాలు సాగిస్తారు. 
 
సింహం : ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. 
 
కన్య : బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలం. 
 
తుల : అకాల భోజనం, పనిభారం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కలప, ఇటుక ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి పరీక్షా సమయం. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆత్మీయుల కోసం ధన విరివిగా వ్యయం చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. 
 
ధనస్సు : గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. స్త్రీలకు పొట్ట, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక వాయిదాపడటంతో నిరుత్సాహానికి గురవుతారు. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించడానికి మరికొంతకాలం పడుతుంది.
 
మకరం : రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలు, పంతాలకు పోకుండా విజ్ఞతతో వ్యవహరించవలసి ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. 
 
కుంభం : మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. 
 
మీనం : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. విలైనంత వరకూ మీ పనులు మీరే చేసుకోవడం శ్రేయస్కరం. తరచూ దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments