Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-11-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించినా...

Advertiesment
04-11-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించినా...
, బుధవారం, 4 నవంబరు 2020 (04:38 IST)
మేషం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుది. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కార్యదీక్షతతో వ్యవహరించి మీరు అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుంది ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. మీ గురించి కొంత మంది చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఇంట్లో వృత్తి వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తారు. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కళ, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
సింహం : మీ శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. గృహంలో శుభకార్యం చెయ్యాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. బంధు మిత్రులను కలుసుకుంటారు. 
 
కన్య : భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవయ్యం విషయంలో మెళకువ వహించండి. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
తుల : తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కష్ట సమయాలలో సన్నిహితులు అండగా నిలుస్తారు. కోర్టు పనులు వాయిదాపడి నిరుత్సాహం కలిగిస్తుంది. ఖర్చులకు ఆదాయానికి ఏమాత్రం పొంతనవుండదు. కుటుంబ విషయాలు చర్చిస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో కొన్ని ముఖ్య విషయాల గురించి సంప్రదింపులు జరుపుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మిత్రులకు మీ సమర్థతపై నమ్మకం ఏర్పడుతుంది. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ప్రేమికుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల కోసం ధన విరివిగా వ్యయం చేస్తారు. 
 
మకరం : ఉపాధ్యాయులకు శ్రమాధిక్యతతో పాటు సంతృప్తి కానవస్తుంది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా పూర్తిచేస్తారు. ఫ్లీడర్లకు చికాకులు తప్పవు. 
 
కుంభం : స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధన విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు బదిలీ అయ్యే ఆవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. వాహన నడిపేటపుడు జాగ్రత్త అవసరం. ఓర్పు, పట్టుదల ధోరణితో వ్యవహరించడం వల్ల ఓ సమస్య పరిష్కారమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.కోట్లు కురిపిస్తున్న శ్రీవారి హుండీ.. లాక్డౌన్ తర్వాత తొలిసారి...