Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31-10-2020 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం స్వీకరిస్తే...

Advertiesment
31-10-2020 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం స్వీకరిస్తే...
, శనివారం, 31 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. భాగస్వామికుల మధ్య విభేదాలు, పట్టింపులు తలెత్తే ఆస్కారం ఉంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. 
 
వృషభం : రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాల్లో ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రేవేటు పత్రికా రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తప్పవు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. 
 
మిథునం : స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదలీ వంటి శుభపరిణామాలు ఉంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : చేత వృత్తుల వారిక ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఉద్యోగస్తులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
 
సింహం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. రావలసిన ధనం అందక పోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రియతములో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
 
కన్య : అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసోకవడం ఉత్తమం. కుటుంబ ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక వ్యవహారంలో సోదరుల నుంచి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
తుల : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉల్లి, బెల్లం, పసుపు, కంది, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించకగలవు. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. అవరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ వాక్‌చాతుర్యానికి, మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ చాలా అవసరం. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తికావు. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మకరం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిత్రాు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మీనం : ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపం పంచభూతాల కలయిక.. ఎలాగంటే?