Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-10-2020 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...

Advertiesment
30-10-2020 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (04:02 IST)
మేషం : ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. దూర ప్రదేశంలో ఉన్న మీ సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తువులు, నగదు విషయాల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్‌లలో ఏకాగ్రత ప్రధానం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. 
 
వృషభం : ఏ విషయంపై ఆసక్తి అంతగా ఉండదు. పెద్దమొత్తంలో ధన సహాయం మంచిదికాదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంగీత, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. కొనుగోలుదార్లను తేలికగా ఆకట్టుకుంటారు. చిన్నారుల ఆరోగ్యం కలవరపరుస్తుంది. 
 
మిథునం : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. సభ్యత్వాలు, పదవుల స్వీకరిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తులవారికి ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ముఖ్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. విద్యార్థులు వాహనాన్ని నిదానంగా నడపాలి. బెట్టింగులు, జూదాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
సింహం : సోదరీ, సోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు పదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కొంటారు. ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. తమ మాటే నెగ్గాలన్న పంతం ఇరువురికి తగదు. సానుకూలంగా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ సంతానం పై చదువుల విషయంలో ఆందోళన తొలగుతుంది. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు. 
 
తుల : గత సంఘటనలు, అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవులు మంజూరవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. దైవ, సేవా, కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. పనుల కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టిసారిస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. వేధింపుల అధికారి బదిలీ వార్త సంతోషం కలిగిస్తుంది. సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ వాహనం ఇతరులకు ఇవ్వొద్దు. వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : రుణం తీర్చడంతో పాటు తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వ్యాపారాల్లో పోటీ, పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు. వృత్తుల వారికి గుర్తింపు, ఆదాయాభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు.
 
మకరం : పట్టువిడుపు ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 
 
కుంభం : మీకు ఆందోళన కలిగించిన సమస్య తేలికగా సమసిపోతుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. నగదు చెల్లింపుల్లో తొందరపడవద్దు. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయండి. స్త్రీలకు టీవీ చానెళ్ళ కార్యక్రమాలలో అవకాశం లభిస్తుంది. 
 
మీనం : వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తిపరమైన సంబంధాలు బలపడతాయి. ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలవాటు లేని పనులు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. హోల్‌సేల్, రిటైల్ పెద్దమొత్తం స్టాక్‌లో అప్రమత్తంగా ఉండాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులు మీ డబ్బులు రీఫండ్, 2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో, ఎలా?