Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1-11-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యునిని ఎర్రని పూలతో..?

1-11-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యునిని ఎర్రని పూలతో..?
, ఆదివారం, 1 నవంబరు 2020 (05:00 IST)
ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మేషం: కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు, గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. 
 
వృషభం: పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించి ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. 
 
మిథునం: చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి అధికం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. 
 
కర్కాటకం: మీపై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి. సమస్యలు అవే సర్దుకుంటాయి. బిల్లులు చెల్లిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
సింహం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. ఏ విషయంలోను దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి.
 
కన్య: వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిత్యావసర వస్టు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు.
 
తుల: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. అతిథి మర్యాదలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మిత్రుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మీ ఆంతరంగిక విషయాలు ఇతరుల ముందుకు ఏకరువు పెట్టడం మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం: ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. రావలసిన ధనం అందటంతో ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం వుంది. 
 
ధనస్సు: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలున్నాయి. 
 
మకరం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కుంభం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలకు గురికావలసి వస్తుంది. కళాకారులకు, రచయితలకు, అభిమాన బృందాలు అధికం కాగలవు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
మీనం: దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. ఖర్చులు అదుపు చేయాలనే మీ యత్నం నెరవేరకపోగా ధనం మరింత వ్యయమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-11-2020 నుంచి 30-11-2020 వరకు మీ మాస రాశి ఫలాలు