Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-06-2021 శనివారం రాశి ఫలితాలు - పద్మనాభస్వామిని ఆరాధించినా...

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. క్రయ, విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. 
 
వృషభం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. చెల్లింపులు వాయిదా వేస్తారు. 
 
మిథునం : ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావొచ్చు. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఉమ్మడి నిధులు నిర్వహణలో మాటపడాల్సి స్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్త అవసరం. 
 
సింహం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందు భోజనం, వస్త్రలాభం వంటి శుభ పరిణామాలు ఉంటాయి. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 
 
కన్య : వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. రాతకోతలు, ప్రయాణాలు లాభించకపోవచ్చు. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. 
 
తుల : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్థిరాస్తులు, వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. అనుకున్న కార్యములు మధ్యలో నిలిచిపోవును. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. 
 
వృశ్చికం : వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. పొదుపు దిశగా ఆలోచిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. హామీలకు సంబంధించిన విషయాలలో పునరాలోచ అవసరం. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావొచ్చు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. 
 
మకరం : ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు చోటుచేసుకుంటాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. ఆస్థివ్యవహారాల విషయంలో దాయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
కుంభం : పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీ మూలకంగా కలహాలు, ఇతరాత్రా చికాకులు ఎదురవుతాయి. భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించిన సత్ఫలితాలు సాధించగలుగుతారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. 
 
మీనం : శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి అనుకూలం. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. ఒక స్థిరాస్తి విక్రయించాలన్న ఆలోచన స్ఫురిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. పాత మిత్రుల కలయికతే మానసికంగా కుదుటపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments