Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-12-2018 - ఆదివారం దినఫలాలు - నిరుద్యోగులు స్వయం ఉపాధి...

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (09:25 IST)
మేషం: స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు, మార్పులు చేర్పులకు అనుకూలం. దుబారా ఖర్చులు అధికమవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృషభం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో తరచు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.  
 
మిధునం: ఆర్థిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మెుండి బాకీలు సైతం వసూలు కాగలవు. శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి బయటపడుతారు. మీ ఏమరుపాటు తనం వలన పత్రాలు విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.  
 
కర్కాటకం: స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం ఖర్చుచేస్తారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ శక్తి సామర్ధ్యాలపై నమ్మకం ఉంచి శ్రమించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుండి బయటపడుతారు.   
 
సింహం: బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకు పోవడం క్షేమదాయకం. విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ప్రింటింగ్ పనివారలకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.  
 
కన్య: రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి.    
 
తుల: బేకరీ, స్వీట్లు, పూల, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.  
 
వృశ్చికం: రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం మంచిది. ప్రైవేటు ఫైనాన్సులో మదుపు చేయడం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది.  
 
ధనస్సు: స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికపై కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.  
 
మకరం: స్త్రీలకు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. కొత్త వ్యక్తులను దరిచేర నీయకండి. భార్యా, భర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది.     
 
కుంభం: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దూరప్రయాణాలు విసుగు కలిగిస్తాయి.    
 
మీనం: కుటుంబీకులకు, బంధువుల నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టుప్రక్కల వారి వ్యాఖ్యాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత అవసరం. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

తర్వాతి కథనం
Show comments