Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్పనా చావ్లా జయంతి నేడు.. ఏదో ఒకటి చేయండి.. కానీ.. తమాషా ఏంటంటే?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:25 IST)
అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయురాలు కల్పనా చావ్లా జయంతి నేడు. కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్‌లో జన్మించారు. అయితే ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1వ తేదీ 1961కి మార్చారు. చిన్న వయస్సు నుండే కల్పన విమానాల పట్ల ఆకర్షితురాలయ్యారు. ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు.
 
కల్పన టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. కొలరాడో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం కల్పనా చావ్లా తన అద్భుతమైన ప్రతిభతో 1988లో నాసాలో అడుగు పెట్టారు.
 
1993లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్‌లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్‌కార్పోరేటెడ్‌లో ప్రెసిడెంట్ అయ్యారు. అదే సమయంలో ఓవర్‌సెట్ మెథడ్స్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా కూడా పనిచేశారు. 1995లో నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్నిపూర్తి చేసుకున్నారు.
 
1997లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడు కల్పనా 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. అప్పుడు కల్పన చావ్లాను చూసి దేశం మొత్తం గర్వించింది. 1997లో ఎస్‌టిఎస్ - 87లో అంతరిక్షం పైకి వెళ్ళారు. మిషన్ స్పెషలిస్టుగా ఎస్‌టిఎస్ -87 ను ప్రయాణించిన ఆరుగురు సభ్యుల బృందంలో కల్పన ఒకరు.
 
2000లో ప్రారంభం కావాల్సిన రెండవ అంతరిక్ష ప్రయాణం కొన్ని కారణాలతో ఆలస్యమై.. రెండేళ్ల తర్వాత ప్రారంభమైంది. 2003లో కల్పన యొక్క రెండవ అంతరిక్ష మిషన్ STS-107 మిషన్ ప్రారంభమైంది. రెండవ సారి అంతరిక్ష యాత్రను ముగించుకుని వస్తుండగా 2003 ఫిబ్రవరి 1 న కొలంబియా వ్యోమనౌక కూలిపోవడంతో ఆమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు దుర్మరణం పాలయ్యారు. జనవరి 16 నుండి ప్రారంభమైన ఈ మిషన్ 16 రోజులపాటు సాగింది.
 
ఆమె గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి ఏటా ప్రకటిస్తోంది. దీన్ని వివిధ రంగాల్లో 15 మంది శక్తివంతమైన మహిళకు అందజేస్తుంది. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2003లో ప్రయోగించిన మెట్ శాట్‌కు కల్పనా చావ్లా పేరు పెట్టారు. అంతరిక్షయానం చేసిన తొలి ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు.
 
నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపుక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక డాక్టరు ఈమె ఎక్స్‌రే పరిశోలిస్తూ "నువ్వు శాకాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్‌రే చూడగానే తెలిసిందిలే. ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది" అంటూ డాక్టరు పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు.
 
2003, జనవరి 16న రెండోసారి అంతరిక్షంలోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే..... "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,... దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేయని చెప్పేవారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

తర్వాతి కథనం
Show comments