Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిరాజ్ పుట్టినరోజు.. ఐపీఎల్‌‌తో జాక్ పాట్.. బాక్సింగ్‌ డేలో ఐదు వికెట్లు

సిరాజ్ పుట్టినరోజు.. ఐపీఎల్‌‌తో జాక్ పాట్.. బాక్సింగ్‌ డేలో ఐదు వికెట్లు
, శనివారం, 13 మార్చి 2021 (11:41 IST)
మొహ్మద్ సిరాజ్ పుట్టిన రోజు నేడు. 2020 భారత జట్టు ఆస్ట్రేలియా దేశ పర్యటన సందర్భంగా సిరాజ్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బాక్సింగ్ డే మ్యాచ్‌గా పిలవబడే ఆ మ్యాచ్ డిసెంబరు 26 న జరిగింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిచింది. మంచి పేస్‌, స్వింగ్‌ కలిగిన సిరాజ్‌ హెచ్.సి.ఎ ఎ-డివిజన్‌ లీగ్‌లో సత్తాచాటాడు. ఎ-డివిజన్‌ ప్రదర్శనతో హైదరాబాద్‌ అండర్‌-23 జట్టుకు ఎంపికైన సిరాజ్‌ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు.
 
అండర్‌-23 జట్టు తరఫున సత్తాచాటి హైదరాబాద్‌ రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన సిరాజ్‌.. కోచ్‌ భరత్‌ అరుణ్‌ దృష్టిలో పడ్డాడు. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న భరత్‌.. 2016 హైదరాబాద్‌ రంజీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఒకరకంగా టీమ్‌ఇండియాకు సిరాజ్‌ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర. 2016 రంజీ ట్రోఫీలో సిరాజ్‌, రవికిరణ్‌, సీవీ మిలింద్‌లతో భరత్‌ సంచలనాలు నమోదు చేశాడు.
 
గత రంజీ సీజన్‌లో ముగ్గురు పేసర్లు కలిసి 110 వికెట్లు తీయడం విశేషం. అందులో సిరాజ్‌ 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్టాఫ్‌ ఇండియాకు సిరాజ్‌ ఎంపికయ్యాడు.
 
రంజీ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడిన సిరాజ్‌కు ఐపీఎల్‌ రూపంలో జాక్‌పాట్‌ తగిలింది. 2017 లో జరిగిన వేలం పాటలో 23 ఏళ్ళ సిరాజ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.2.6 కోట్లకు కొనుక్కోవడం అతిపెద్ద సంచలనమైంది. కోచ్‌ టామ్‌ మూడీ, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల మార్గనిర్దేశనంలో ఐపీఎల్‌లో ఆడిన సిరాజ్‌ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 
 
గుజరాత్‌ లయన్స్‌తో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించాడు. ఐపీఎల్‌ అనంతరం నేరుగా ఇండియా-ఎ జట్టుకు ఎంపికైన సిరాజ్‌ను కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరింత సానబెట్టాడు. సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో ఐదు వికెట్లు (5/103) తీశాడు. 
webdunia
Mohammed Siraj_Father
 
వరుసగా దక్షిణాఫ్రికా-ఎ, అఫ్గానిస్థాన్‌-ఎ, న్యూజిలాండ్‌-ఎ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇండియా-ఎ తరఫున సిరాజ్‌ బరిలో దిగి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం సిరాజ్‌ బౌలింగ్‌లో మంచి పేస్‌ ఉంటుంది. సహజసిద్ధమైన స్వింగ్‌ అతని సొంతం.  ఐదు టెస్టులు, ఆరు ఇన్నింగ్స్‌లు, 39 పరుగులు, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు, టీ-20లు మూడు, ఐపీఎల్ 35 మ్యాచ్‌లు, వన్డే ఒక మ్యాచ్ ఆడాడు. బౌలింగ్ పరంగా చూస్తే టెస్టుల్లో 16, ట్వంటీ-20ల్లో 3, ఐపీఎల్‌లో 35 వికెట్లు పడగొట్టాడు. రంజీల్లో 9 మ్యాచ్‌లాడిన సిరాజ్ 41 వికెట్లు సాధించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌తో తొలి ట్వంటీ-20: టీమిండియా ఘోర పరాజయం