Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల నూనె చర్మానికి రాసుకుంటే..?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (12:18 IST)
చలికాలంలో పడిపోయే ఉష్ణోగ్రత, వీచే చలిగాలులు చర్మాన్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. చర్మానికి ఈ రుతువులో అదనపు రక్షణ చాలా అవసరం. ఆ రక్షణను అందించే నూనెలను చర్మం మీద మర్దన చేసినప్పుడు అవి చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అందుకు ఉపకరించే నూనెలు...
 
నువ్వుల నూనె: ఈ నూనెలో ఉన్న విటమిన్ బి, ఇ లు చర్మానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియమ్, మెగ్నీషియం ద్వారా చర్మం లబ్దిపొందుతుంది. సూర్య కాంతి ప్రభావం చర్మం మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనెతో శరీరం మర్దన చేయించుకుంటే అలసట పోతుంది. చర్మానికి తాజాదనం సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.
 
ఆలివ్‌ నూనె: చర్మ సౌందర్యానికి చక్కని సాధనం ఆలివ్ నూనె. దీనిలో ఉన్న విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వలన చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనెను మర్దన చేస్తే చర్మం ఎంతో చక్కని తేజస్సును పొందుతుంది.
 
కొబ్బరి నూనె: దీనిలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనెను చలికాలంలో శరీరానికి రాసుకుంటే ముడుతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఏ తరహాకి చెందినదైనా కొబ్బరి నూనె వాడకం సరైనదే. పలు రకాల చర్మరోగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకుంది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments