వేపాకులను ముద్దుగా చేసుకుని ఉడికించి..?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:10 IST)
జుట్టు రాలిపోవడం వలన బట్టతల వస్తుంది. దీని కారణంగా నలుగురిలో తిరగాలంటే.. చాలా ఇబ్బందిగా ఉంది. పెరుగుతున్న కాలుష్యం, మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఇతరత్రా కారణాల వలన పురుషుల్లో ఇదొక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇక స్త్రీలలలోనూ ఈ సమస్య అధికమే. జుట్టు రాలిపోతుందని ఏవేవో నూనెలు, షాంపూలు వాడి సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే..
 
స్వఛ్చమైన కొబ్బరి నూనె లేదా బాదం నూనెను తీసుకుని వేడి చేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టించి.. మునివేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
 
ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి. ఉల్లిపాయ జ్యూస్ చాలామందికి రుచించదు. కానీ దీనిలో అత్యధికంగా ఉంటే సల్ఫర్.. కుదుళ్ల మధ్య రక్తప్రసరణను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. కుదుళ్ల రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే బ్యాక్టీరియల్ లక్షణాలు సూక్ష్మజీవులను అరికట్టి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. కనుక తప్పక ఉల్లిపాయ జ్యూస్‌ను జుట్టుకు రాసుకోండి.. తప్పక ఫలితం కనిపిస్తుంది.
 
వేపాకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. అదేవిధంగా కురుల పెరుగుదలకు అంతే మేలు చేస్తాయి. కొన్ని వేపాకులను ముద్దుగా చేసుకుని ఉడికించాలి. చల్లార్చిన తరువాత తలకు పట్టించాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమంగా చేస్తుంటే.. జుట్టు రాలకుండా ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళంకు కొత్త విమానాశ్రయం.. రెండు రోజుల్లోనే రూ.13లక్షల కోట్లు

Vangaveeti: వంగవీటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఆశా కిరణ్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

తర్వాతి కథనం
Show comments