Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుడితో మేమూ సమానం.. ఓ పెగ్గు వేయాల్సిందే : మహిళల మనోగతం

సమాజంలో పురుషుడితో మేమూ సమానమే. వారితో పాటు మేమూ ఆర్థికంగా స్థిరపడుతున్నాం. వారిలానే మేమూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. అలాంటపుడు మేము కూడా ఓ పెగ్గు వేయాల్సిందేనంటూ దేశంలోని మగువలు తెగేసి చెపుతున్నారు.

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (08:31 IST)
సమాజంలో పురుషుడితో మేమూ సమానమే. వారితో పాటు మేమూ ఆర్థికంగా స్థిరపడుతున్నాం. వారిలానే మేమూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. అలాంటపుడు మేము కూడా ఓ పెగ్గు వేయాల్సిందేనంటూ దేశంలోని మగువలు తెగేసి చెపుతున్నారు. ముఖ్యంగా.. నగరాల్లో నివశించే మహిళలు.. యేడాదిలో ఒక్కసారైనా మద్యం రుచి చూస్తున్నారట. ఇలా రుచి చూస్తున్న వారు ఐదు శాతం ఉండగా, వీరి వల్ల ఏటా 30 శాతం అమ్మకాలు పెరుగుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. 
 
నిజానికి మద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్‌ కారకం. ఎక్కడ చూసినా మనకు కనిపించే ప్రకటన ఇది. ఇలా అవగాహన పెంచడం వల్ల ఎక్కువ మంది ఈ అలవాట్లకు దూరమవుతారని ప్రభుత్వం ఆశ. కానీ జరుగుతోంది వేరు. ఇప్పటి వరకూ మద్యపానం పురుషులకే పరిమితం అన్నట్టుండేది. క్రమంగా ఈ ధోరణి మారుతోంది. మహిళల్లోనూ మద్యపానం పెరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలతో పోల్చితే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు దాదాపు పురుషులతో సమానంగా మద్యం తాగుతున్నారట.
 
ఇదే విషయంపై ఆస్ట్రేలియాలని న్యూ సౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయం ఐదేళ్ళపాటు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన మేరకు ఒకప్పుడు మద్యపానం విషయంలో పురుషులు, మహిళల మధ్య తేడా 12 రెట్లుగా ఉండగా, ఇపుడది బాగా తగ్గిపోయింది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దేశంలో మద్యం తాగే మహిళలు చాలా తక్కువ. కానీ నగరాల్లో క్రమంగా పెరుగుతున్నారు. అమెరికాలో 60 శాతం మంది మహిళలు ఏడాదిలో ఒక్కసారైనా మద్యం రుచి చూస్తుండగా ఈ రేటు భారత నగరాల్లో 5 శాతంగా ఉన్నట్లు అంచనా వేసింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తీయని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

తర్వాతి కథనం
Show comments