Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా దుప్పట్లో కప్పి పెడుతున్న‌ట్లే లెక్క...

లేటుగా పడుకోవడం.. లేటుగా నిద్రలేవడం... న‌గ‌ర జీవితంలో కామ‌న్ అయిపోయింది. ఆఫీస్ వర్కో, పెండింగ్ ప్రాజెక్టో, బోర్డు మీటింగో, పార్టీయో, ఫంక్షనో.. ఏదీ లేక‌పోతే, బేవార్స్‌గా అర్ధ‌రాత్రి వ‌ర‌కు తోచ‌క తిరిగొచ్చి... ఒంటి గంట దాటితే గానీ బెడ్ మీదకి చేరుకోవడం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (19:43 IST)
లేటుగా పడుకోవడం.. లేటుగా నిద్రలేవడం... న‌గ‌ర జీవితంలో కామ‌న్ అయిపోయింది. ఆఫీస్ వర్కో, పెండింగ్ ప్రాజెక్టో, బోర్డు మీటింగో, పార్టీయో, ఫంక్షనో.. ఏదీ లేక‌పోతే, బేవార్స్‌గా అర్ధ‌రాత్రి వ‌ర‌కు తోచ‌క తిరిగొచ్చి... ఒంటి గంట దాటితే గానీ బెడ్ మీదకి చేరుకోవడం లేదు. దాంతో ఏం మిస్సవుతున్నామో తెలుసా? నిజంగా అవి ఫీల‌యితే... మీరు బారెడు పొద్దుఎక్కే వ‌ర‌కు ప‌డుకోరు.
 
నులివెచ్చని సూర్యోదయం మీరు మిస్స‌యిపోతారు. కుండీలో పూల మొక్కపై రాలిన తుషార బిందులు.. తెలిమంచు తెరలు.. పక్షుల కిలకిలా రావాలు...అంతేకాదు... తెల్ల‌వారుజామున వ‌చ్చే స్వ‌చ్చ‌మైన ఆక్సిజ‌న్. అన్నింటికీ మించి పెద్ద‌లు చెప్పే బ్ర‌హ్మ ముహూర్తం... ఇది మిస్ అయితే, ఇక జీవితంలో అసాధ్యాల‌ను సుసాధ్యాలు చేసే శ‌క్తిని మ‌నం కోల్పోతాం. 
 
ఉద‌యం క‌నీసం అయిదింటికైనా మ‌నం నిద్ర లేవ‌క‌పోతే... ముఖ్యంగా ఆరోగ్యాన్ని చేజేతులా దుప్పట్లో కప్పిపెడుతున్న‌ట్లే లెక్క‌. కేవలం ఆఫీస్ పేరు చెప్పుకునే పొద్దెక్కే దాకా పక్క మీదనే ఉంటున్నాం. మరి బడా బడా వ్యాపారవేత్తలు, సీఈవోలు, సెలబ్రిటీలు బిజీ షెడ్యూల్లో కూడా ఎంత పొద్దున లేస్తారో తెలుసా? వాళ్లవాళ్ల మార్నింగ్ షెడ్యూల్ చదివితే మీరు కచ్చితంగా మారుతారు. అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా మొద‌లుకొని... పారిశ్రామిక వేత్తలు, కంప్యూట‌ర్ మేధావులు, అంబానీ, బిల్ గేట్స్ వ‌ర‌కు... మ‌న ప్ర‌ధాని మోదీ, ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్ర‌బాబులు కూడా తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌క‌ల్లా నిద్ర లేస్తారు.
 
ఒక మనిషి సక్సెస్‌కు కారణం కష్డపడటం ఒక ఎత్తయితే.. పొద్దన్నే నిద్రలేవడం మరో ఎత్తట. హెల్త్ పరంగానైనా, కెరీర్ విషయంలోనైనా పొద్దున్నే నిద్రలేచేదాన్ని బట్టే మన విజయాలు ఆధారపడి ఉంటాయి. మనం ఎంత పెందలాడే లేస్తే అన్ని అభివృద్ధి గంటలు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఇదో సైంటిఫిక్ రీసెర్చ్. అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments