Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులకు చేతులనిండా గాజులు ఎందుకు... అలంకరిస్తారో తెలుసా?

గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు రంగు గాజులను ధరించి అమ్మాయిల చేతులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. చేతులకి గాజుల అందం చెంపకు సిగ్గులందము అన్నాడో మహాకవి. కేవలం అందం క

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (15:53 IST)
గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు రంగు గాజులను ధరించి అమ్మాయిల చేతులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. చేతులకి గాజుల అందం చెంపకు సిగ్గులందము అన్నాడో మహాకవి. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం అని అనుకోవడం పొరపాటు. గాజులు స్త్రీకి రక్షాకం కణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
 
ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్నతనం నుండే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే. అందుకే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.
 
అంతేకాదు గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటుంది. మణికట్టు నాడుల స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతుంటాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. అందుకే గర్భిణులకు నిండుగా గాజులు వేసి అలంకరిస్తారు. గాజుల శబ్ధం గర్భస్థ శిశువు చెవులకు ఇంపుగా వినిపిస్తాయని తద్వారా శిశువుకు శబ్ధాన్ని గ్రహించే శక్తి పెంపొందుతుందని వైద్యులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments